Institutes

జానం Explossion ప్రపంచం ముందుకు సాగుతుంది. విద్యార్థులు క్రొత్త కోర్సుల వైపు కర్షితులవ్వటం డబ్బున్నవారు మంచి మంచి ఇనిస్టిట్యూట్లలో చేరి మంచి ర్యాంకులు, అధికంగా మార్కులు తెచ్చుకుంటున్నారు. ఇంకా వ్యక్తిత్వ వికాసం పేరిట విద్యార్థుల వద్ద  నుంచి వేల కొద్ది డబ్బులు యాజమాన్యాలు వసూలు చేస్తున్నాయి. ఇవన్నీ కూడా ధనికుల పిల్లలు మాత్రమే ఆస్వాదిస్తున్నారు. పేద పిల్లలకు ఇవన్నీ కూడా కలలుగానే మారుతున్నాయి. అంతేగాకుండా ఇంతేకాకుండా ఇనిస్టిట్యూట్ అన్ని కూడా విద్యార్థులకు పుస్తక జానాన్ని మాత్రమే ఇస్తున్నాయి. వారిలో సామాజిక, రాజకీయ చైతన్యం పెంపొందించే కార్యక్రమాలు  ఏ యాజమాన్యం కూడా నిర్వహించినట్లేదు. SIO దీనిని చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. SIO ఆధ్వర్యంలో 2 ఇనిస్టిట్యూట్స్ నడుపబడుతున్నాయి. ఒకటి సైదాబాద్ లో, మరొకటి అంబర్ పేట్, హైదరాబాద్ లో కలవు. సైదాబాద్ ఇనిస్టిట్యూట్ 2002లో స్థాపించబడింది. దీనియొక్క ఉద్దేశ్యం ధనార్జన కాదు. విద్యార్థులకు సరైన కోచింగ్ ఇవ్వటం.  ఈ ఇనిస్టిట్యూట్లో 10వ తరగతి, ఇంటర్, పాలిటెక్నిక్, బిఇఢి ఎంట్రన్స్ టెస్ట్ లకు కూడా కోచింగ్ ఇవ్వబడుతుంది. ఇప్పుడు ఇంటర్లో దాదాపు 150మంది విద్యార్థులకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. 10మంది టీచింగ్ స్టాఫ్, ఒకరు నాన్ టీచింగ్ స్టాఫ్ (SIO సభ్యుడి పర్యవేఓకుడుగా వ్యవహరిస్తాడు.) అంబర్ పేట్ : ఇది 2008లో స్థాపించబడింది. 9వ తరగతి, 10వ తరగతి విద్యార్థులకు కోచింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఇప్పటి వరకు దాదాపు 50మంది విద్యార్థులు  FET ఇనిస్టిట్యూట్ ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. ఇది కూడా అల్లాహ్ దయవల్ల మంచిగా నడుపబడుతుంది.