లక్ష్యాలు -- Aims and Objectives
స్టూడెంట్స్ ఇస్లామీక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా దైవాదేశాల వెలుగులో సమాజ పునర్నిర్మణానికి అవసరమైన విద్యార్థులను, యువకులను తయారు చేయడం లక్ష్యంగా భారతదేశంలో పని చేస్తున్న సైద్ధాంతిక, నైతిక విలువలున్న విద్యార్థి సంస్థ ఎస్ఐఓను అర్థం చేసుకునే ముందు విద్యార్థులు, యువకులు ఇస్లామీయపై సంస్థకు ఉన్నా దృక్పధాన్ని అర్థం చేసుకోవాలి. ఇస్లామీయ అనే అరబీ పదానికి శబ్దిక అర్థం శాంతి, స్వయం సమర్పణ అని ముందు గ్రహించాలి. ఇస్లాం శాంతికి రచబాట వేస్తుందని అంతకంటే ముందు మనం మనల్ని దైవానికి పూర్తిగా సమర్పించుకున్నప్పుడే సాధ్యమవుతుంది. మనిషి జీవితానికి, మనుగడకు, భవిష్యత్త్ కు సంభంధించిన వాస్తవ విషయాలను తెలిపేదిగా విద్యా ఉండాలని ఎస్ఐఓ నమ్ముతుంది. ఎవరైతే తమ జీవితానికి విశ్వానికి సంబంధించిన వాస్తవాలను తెలుసుకుంటారో వారినే నిజమైన విద్యార్థులుగా ఎస్ఐఓ గుర్తిస్తుంది. మంచి, చెడు అనే విచక్షణ లేకుండా విద్యార్థులను పోగు చేసి పని చేయించడాన్ని ఎస్ఐఓ తీవ్రంగా పరిగణిస్తుంది. ఇందుకు భిన్నంగా సమాజ శ్రేయస్సుకు పనికొచ్చే తామలో అంతర్లీనంగా ఉన్న ప్రతిభను వెలికి తీసి విద్యార్థుల సామర్థ్యలకు మరింత పదును పెడుతుంది.
1) విద్యార్దులకు, యువకులకు ఇస్లాం సందేశం అందజేయటం.
2) విద్యార్దులు, యువకులలో ధార్మిక జ్ఙానాన్ని పెంపొందించి, వారిలో ధార్మిక సృహను మెలుకొల్పడం.
3) దివ్య ఖుర్ఆన్ మరియు సున్నత్ ప్రకారం తమ వ్యక్తిగత జీవితాలను మలుచకునేలా విద్యార్దులు, యువకుల్ని సంసిద్దులుగా చేయడం.
4) విద్యార్దులు, యువకుల్ని, మంచిని పెంచడానికి చెడులను రూపుమాపడానికి సమాయత్తపరచడం.
5) విద్యా విధానంలో నైతిక విలువలు, విద్యా సంస్థలో ఉత్తమ నైతిక మరియు విద్యా వాతావరణాన్ని చిగురింపజేసి, అభివృద్దిపర్చడం.
6) సంస్థకు సంబంధించిన వారికి సమగ్ర శిక్షణ నివ్వడం, వారి సామర్య్దాలను వికసింపజేసి, వారిని ఇస్లామియా ఉద్యమానికి ఉత్తమోత్తములుగా తీర్చిదిద్దడం.