South

South Region

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధి – ఉపాధ్యాయ నిష్పత్తి దారుణం : యస్ ఐ ఓ నెల్లూర్

Rally on RTE SIO Nellore

నెల్లూర్ : స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా నెల్లూర్ శాఖ అధ్వర్యంలో విద్యా హక్కు చట్టాన్ని ప్రభుత్వం పూర్తిగా అమలు చేయాలని విద్యార్ధులు ర్యాలీ ను నిర్వహించారు. యస్ ఐ ఓ స్ధానిక అధ్యక్షులు బ్రాదర్ అలీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో విద్యా హక్కు చట్టాన్ని ప్రభుత్వం పూర్తిగా అమలు చేయడం లేదని విద్యార్ధి – ఉపాధ్యాయ నిష్పత్తి దారుణంగా ఉందని తెలిపారు.

దావా పోస్టర్ విడుదల

Dawah Poster release SIO AP South

హైదరాబాద్: స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ దక్షిణ విభాగ దావా పోస్టర్ ను రాష్ట్ర కార్య వర్గం అధ్వర్యంలో విడుదల చేశారు. పవిత్ర రంజాన్ మాసపు ప్రాముఖ్యతను విద్యార్దులకు తెలుపడానికి ఈ పోస్టర్ ను కళాశాలలో, కోచింగ్  సెంటర్లలో చేరవేయడం జరుగుతుందని ఈ సందర్భంగా యస్ ఐ ఓ రాష్ట్ర సందేశ విభాగ కార్యదర్శి బ్రాదర్ కరీముద్దీన్ తెలిపారు

SIO ఆంధ్రప్రదేశ్ దక్షిణ విభాగం అధ్యర్యంలో ప్రతిభా పరీక్ష

Talent Test 2011 pdtr

కడప: SIO ఆంధ్రప్రదేశ్ దక్షిణ విభాగం అధ్యర్యంలో హైస్కూల్ స్థాయి ఎనిమిది, తొమ్మిది మరియు పదవ తరగతి విద్యార్ధులకు ప్రతిభా పరీక్షను నిర్వహించారు.

యస్ ఐ ఓ దక్షిణ విభాగం అధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం

teachers day celebrations 2012 sio ap south

కడప : యస్ ఐ ఓ దక్షిణ విభాగం అధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. గురువు యొక్క విశిష్టతను చాటి చెబుతూ విద్యార్ధులకు సందేశాన్ని అందజేశారు. నేటి సినిమాలలో గురువులను కమెడియన్ గా చూపిస్తూ వారి ప్రతిష్టను దిగజార్చుతున్నారని యస్ ఐ ఓ దక్షిణ విభాగ కార్యదర్శి బ్రాదర్ హనీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు.

యస్ ఐ ఓ అధ్వర్యంలో JNTU అనంతపురం యూనివర్సిటీ నందు ఇఫ్తార్ విందు

JNTUA IFTAAR PARTY 2012

అనంతపురం : యస్ ఐ ఓ అనంతపురం అధ్వర్యంలో స్థానిక JNTU హాస్టల్ నందు ఇఫ్తార్ విందును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జెఐహెచ్ జిల్లా అధ్యక్షులు జనాబ్ మొహియుద్దీన్ గారు ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాస విశిష్టతను మరియు చిట్ట చివరి దైవ గ్రంధం అయిన దివ్యఖురాన్ తో ఈ మాసం యెక్క సంబంధాన్ని తెలిపారు.